మోదీ సర్కార్ నన్ను టార్గెట్ చేసింది.. నా ఫోన్లో స్పైవేర్: కేసీ వేణుగోపాల్
- మోదీ సర్కారు తనను టార్గెట్ గా చేసుకుందన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
- స్పైవేర్‌ను తన మొబైల్ ఫోన్‌పై గురిపెట్టిందని వెల్లడి
- ఈ బహుమతి గురించి యాపిల్ సంస్థ తనను ముందుగానే అప్రమత్తం చేసిందని వ్యాఖ్య
నరేంద్రమోదీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ లక్ష్యంగా స్పైవేర్‌ను గురిపెట్టిందని మండిపడ్డారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి ఆయనకు వచ్చిన అలర్ట్ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘‘మోదీ జీ! మీకు ప్రియమైన స్పైవేర్‌ను నా ఫోన్లోకి పంపిస్తున్నందుకు థాంక్స్. మీరు పంపిన ఈ ప్రత్యేక కానుక గురించి యాపిల్ ఎంతో దయతో నన్ను అప్రమత్తం చేసింది. రాజకీయ ప్రత్యర్థుల వెంటపడుతూ వారి గోప్యతలో చొరబడటం మీ సర్కారు చేస్తున్న నేరపూరిత, రాజ్యాంగ విరుద్ధ చర్య. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 98 దేశాల్లోని వినియోగదారులకు ఈ అలర్ట్ మేసేజీలను పంపిస్తున్నామని, వీటితో కలిపి 150 దేశాలకు ఇంతవరకూ ఇలాంటివి పంపించామని యాపిల్ తెలిపినట్టు వేణుగోపాల్ పేర్కొన్నారు.