నూతన దంపతులు అనంత్ అంబానీ-రాధికాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆశీర్వాదం.. వీడియో ఇదిగో
- శనివారం రాత్రి జరిగిన ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు హాజరైన మోదీ
- ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
- ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు
అంగరంగ వైభవంగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా శుక్రవారం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ దంపతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీవించారు. శనివారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ఆయన హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంత్ అంబానీ తండ్రి, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులు అందరినీ ప్రధాని మోదీ పలకరించారు. తన కొడుకుని ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ముకేశ్ అంబానీ సాదరస్వాగతం పలికారు.
జియో వరల్డ్ సెంటర్‌లో ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోతో పాటు అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులు విచ్చేశారు. కాగా జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక జరిగింది. ఇవాళ (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి.