జింబాబ్వే 20 ఓవర్లలో 152/7... చేజింగ్ లో టీమిండియా అదుర్స్

  • హరారేలో టీమిండియా-జింబాబ్వే 4వ టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • రాణించిన బౌలర్లు
జింబాబ్వేతో నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా స్ఫూర్తిదాయక ఆటతీరు కనబరుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా ఫామ్ లోకి రావడం జింబాబ్వే జట్టుకు  ఊరటనిచ్చే విషయం. రజా 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేశాడు.

అంతకుముందు, జింబాబ్వే ఓపెనర్లు మదివెరే, మరుమని తొలి వికెట్ కు  63 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ... ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. మదివెరే 25, మరుమని 32 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, తుషార్ దేశ్ పాండే 1, వాషింగ్టన్ సుందర్ 1, అభిషేక్ శర్మ 1, శివమ్ దూబే 1 వికెట్ తీశారు. 

ఇక, 153 పరుగుల  లక్ష్యఛేదనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 65, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 37 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా విజయానికి ఇంకా 60 బంతుల్లో 47 పరుగులు చేయాలి.


More Telugu News