తిరుమల క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

  • వరుసగా రెండ్రోజులు సెలవులు
  • తిరుమల కొండకు భారీగా తరలి వస్తున్న భక్తులు
  • శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
  • నిన్న ఒక్కరోజే స్వామి వారికి రూ.4.69 కోట్ల ఆదాయం
వరుసగా రెండ్రోజులు సెలవులు రావడంతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు రెండో శనివారం కాగా, రేపు ఆదివారం కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 

సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి వస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి షెడ్లు అన్నీ నిండిపోయి, కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. 

నిన్న (శుక్రవారం) స్వామివారిని 63,493 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,676 మంది తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.69 కోట్ల ఆదాయం లభించింది.


More Telugu News