స్కూళ్లలో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- డ్రగ్స్ కట్టడికి హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
- ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసులు, విద్యార్థులతో కలిసి ఏర్పాటు
- తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు అనుమతులు
తెలంగాణలోని పాఠశాలల్లో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్‌ను అరికట్టేందుకు హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసులు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో కలిసి ప్రహరీ క్లబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యా కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.