జింబాబ్వేతో నాలుగో టీ20... టాస్ గెలిచిన టీమిండియా
- టీమిండియా, జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
- 2-1తో ముందంజలో ఉన్న టీమిండియా
- నేడు హరారేలో నాలుగో టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ కైవసం
టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన భారత జట్టు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గి సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. అందుకే శుభ్ మాన్ గిల్ నాయకత్వంలోని యువ జట్టు గెలుపుపై కన్నేసింది.
ఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్ పాండే అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు. అవేష్ ఖాన్ స్థానంలో తుషార్ దేశ్ పాండేకు తుది జట్టులో స్థానం కల్పించారు. మరోవైపు, ఆతిథ్య జింబాబ్వే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.