అద్భుత సదుపాయాలతో సిద్ధమైన చర్లపల్లి రైల్వే స్టేషన్... ఫొటోలు ఇవిగో: కిషన్ రెడ్డి ట్వీట్
- చర్లపల్లి రైల్వే స్టేషన్ 98 శాతం పూర్తయినట్లు తెలిపిన కేంద్రమంత్రి
- తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని వెల్లడి
- 9 ప్లాట్‌ఫాంలతో అందుబాటులోకి చర్లపల్లి రైల్వే స్టేషన్
చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుందని, ఈ స్టేషన్ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ స్టేషన్ ఫొటోలను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అద్భుతమైన... అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్ సిద్ధమైందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే పూర్తి కావాల్సిన ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.434 కోట్ల బడ్జెట్‌తో ఈ స్టేషన్‌ను నిర్మించారు.
ఇది తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందన్నారు. సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతోమందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందన్నారు.