చంద్రబాబుపై ఆధారపడ్డారని ఏపీకి మాత్రమే ఇస్తారా?: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
- విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఇవ్వాలని డిమాండ్
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ చట్టంలో వున్నాయన్న బీఆర్ఎస్ నేత
- ఏపీకి కేంద్రం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమేనన్న వినోద్ కుమార్
కేంద్రంలో చంద్రబాబుపై, టీడీపీపై ఆధారపడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చుతారా? అని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్... నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి తప్పకుండా ఇవ్వాలన్నారు.
శనివారం ఆయన విభజన హామీలపై మాట్లాడుతూ... కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో వున్నాయన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమే అన్నారు.
శనివారం ఆయన విభజన హామీలపై మాట్లాడుతూ... కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలో వున్నాయన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమే అన్నారు.