మీ ఇళ్లను కూడా ఇలాగే నిర్మిస్తారా?.. అధికారులపై మంత్రి నిమ్మల ఫైర్

  • పాలకొల్లులో వంద పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి
  • కొత్త భవనాల నిర్మాణాల పనుల పరిశీలన
  • శ్లాబ్ నుంచి లీకవుతున్న నీటిని చూసి అధికారులపై ఆగ్రహం
  • ప్రభుత్వం మారిందని, పనులు నాణ్యతగా జరగాలని ఆదేశం
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణాలను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. శ్లాబ్ నుంచి లీకవుతున్న వర్షపు నీరు, నిల్వ నీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లను కూడా ఇలాగే కట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం మారిందని, పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జగన్ ఐదేళ్ల పాలనా విధ్వంసం నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తికావాల్సిన పనులు ఐదేళ్లు అయినా గత ప్రభుత్వం పూర్తిచేయలని విమర్శించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును కలెక్టర్, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఫోన్‌లో వివరించారు.


More Telugu News