వచ్చే ఐదు రోజులు ఏపీలో వర్షాలే.. వర్షాలు

  • రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ద్రోణులు
  • వాటి ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • నిన్న చీపురుపల్లిలో 61 మిల్లీమీటర్ల వర్షం
ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో.. సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావానికి తోడు, ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, వైఎస్సార్, అన్నమయ్య తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిన్న సాయంత్రం 5 గంటల వరకు 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


More Telugu News