భారత మాత రూపంలో 3డీ టెంపుల్!
భారత శిల్పకళా వైభవానికి అసలైన చిహ్నాలుగా దేవాలయాలు విలసిల్లుతున్నాయి. ఇక గుడి అంటే సాధారణంగా మనకు గర్భగుడిలో రాతి విగ్రహం, ఇతర దేవతామూర్తులు స్ఫురణకు వస్తాయి. కానీ మన దేశంలో భారత మాత పేరిట ఓ దేవాలయం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ గుడి చాలా స్పెషల్. మన భారత మాత మీద అమితమైన ప్రేమతో అద్భుతమైన ఆలోచనతో వినూత్న రీతిలో 3డీ విధానంలో భారత భూభాగాన్ని గుడిలో ఏర్పాటు చేశారు. ఉపఖండ నైసర్గిక రూపాలన్నీ ఇందులో కనిపించేలా భారత భూభాగాన్ని పాలరాతిపై చెక్కారు. మరి ఈ గుడి ఎక్కడుందీ, ఎవరు నిర్మించారూ అనే అసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.