ఒకే రోజు రెండు సబ్జెక్టుల డీఎస్సీ పరీక్షలు ఉంటే ఒకే చోట రాసేందుకు ఛాన్స్
- తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు రిలీఫ్
- అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు
- ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు
తెలంగాణ డీఎస్సీలో ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. రెండు పరీక్షలను ఒకేచోట రాసేందుకు వెసులుబాటు కల్పించింది. ఉదయం తొలి పరీక్ష రాసిన సెంటర్‌లోనే మధ్యాహ్నం రెండో పరీక్షకు హాజరయ్యేలా అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించారు.
అలాంటి వారికి హాల్‌టికెట్లు మార్చుతామని అధికారులు క్లారిటీ ఇచ్చారు. పలువురు డీఎస్సీ అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో ఉదయం ఒక జిల్లాలో తొలి పరీక్ష, మధ్యాహ్నం మరో జిల్లాలో రెండో పరీక్ష ఉన్నాయి. కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించి ఉపశమనం కల్పించారు. కాగా ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.