అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో తళుక్కుమన్న రామ్ చరణ్, ఉపాసన
- ముంబయిలో అంబానీల ఇంట పెళ్లి వేడుక
- అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ సంబరాలకు ప్రముఖుల రాక
- ఉపాసనతో కలిసి అంబానీ పెళ్లి వేడుకకు హాజరైన రామ్ చరణ్
పెళ్లంటే ఇదేరా అనిపించేలా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పరిణయ మహోత్సవానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన సింపుల్ గా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఉపాసనతో కలిసి కొన్ని ఫొటోలకు పోజులిచ్చిన రామ్ చరణ్... విడిగా మరికొన్ని ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, రామ్ చరణ్, ఉపాసనలను అంబానీ వర్గాలు ఆత్మీయంగా స్వాగతించాయి.