వాళ్లు జగన్ ఫ్యాన్స్ కాదు... వాళ్లు మా వాళ్లు: షర్మిల

  • ఎన్నికల్లో వైసీపీకి 39 శాతం ఓట్లు పడ్డాయన్న షర్మిల
  • వాళ్లంతా చంద్రబాబు సీఎం కాకూడదనే వైసీపీకి ఓటేశారని వెల్లడి
  • వాస్తవానికి వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వాళ్లు అని స్పష్టీకరణ
  • కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో వైసీపీకి ఓటేశారని వివరణ
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 39 శాతం ఓటింగ్ వచ్చిందని, వాళ్లంతా చంద్రబాబు సీఎం కాకూడదని ఓటు వేసినవారేనని షర్మిల పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికలు... చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకూడదా? అనే అంశంపైనే జరిగాయని అన్నారు. 

"ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వాళ్లంతా వైసీపీకి ఓటేశారు. ఎందుకంటే... కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది కాబట్టి వాళ్లంతా వైసీపీ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దు అనుకున్న వారు జగన్ మోహన్ రెడ్డికి ఓటేశారు. అంతే తప్ప... వాళ్లంతా జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కాదు. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అటువైపు వెళ్లిన వాళ్లే. వాళ్లంతా మా వాళ్ళు. మా వాళ్లను మేం రాబట్టుకోవడంలో తప్పేముంది? కచ్చితంగా రాబట్టుకుంటాం! 

వైసీపీకి ఓటు వేసిన 39 శాతం మంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అది మా ఓటు బ్యాంకు. 2029లో ఆ విషయం స్పష్టంగా చూపిస్తాం" అంటూ షర్మిల వివరించారు.


More Telugu News