రెన్యువల్ కోసం సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

  • అగస్ట్‌లో విదేశీ పర్యటన దృష్ట్యా పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న సీఎం
  • ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద భారీ భద్రత
  • హైడ్రా విధివిధానాలపై ముఖ్యమంత్రి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకోవడానికి ఆయన శుక్రవారం సాయంత్రం ఈ కార్యాలయానికి వచ్చారు. ఆగస్ట్‌లో విదేశీ పర్యటన దృష్ట్యా పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకున్నారు. పాస్‌పోర్ట్ కార్యాలయానికి ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

రేవంత్ రెడ్డి సమీక్ష

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణలపై కఠినమైన నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలన్నారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు.


More Telugu News