విశాఖలో మిల్లెట్ చికెన్ దమ్ బిర్యానీ బాగా నచ్చింది: వెంకయ్యనాయుడు

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖపట్నంలోని పయనీర్ ఫుడ్స్ సంస్థ వంటకాలను రుచి చూశారు. తృణధాన్యాలతో చేసిన చికెన్ దమ్ బిర్యానీ (మిల్లెట్ చికెన్ దమ్ బిర్యానీ)ని ఎంతగానో ఆస్వాదించానని వెంకయ్యనాయుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. తృణధాన్యాలు గొప్ప పోషక విలువలు ఉన్న ఆహారం అని వివరించారు. మన ఆరోగ్యకరమైన సంపద్రాయ స్థానిక వ్యవసాయం, స్థానిక వంటకాల్లో ఈ తృణధాన్యాలు అంతర్భాగం అని వివరించారు. ఈ మేరకు పయనీర్ ఫుడ్స్ వారి మిల్లెట్స్ చికెన్ దమ్ బిర్యానీ ఫొటోను కూడా వెంకయ్యనాయుడు పంచుకున్నారు.


More Telugu News