ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు
- అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడు
- ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా నియామకం
- నేడు పొలం పిలుస్తోంది ఫైలుపై తొలి సంతకం చేసిన అచ్చెన్న
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడుకు కీలకమైన వ్యవసాయ శాఖను కేటాయించారు.
ఇవాళ సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన లాంఛనంగా బాధ్యతలు అందుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం ఫైలుపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో రైతులు నష్టపోయారని అన్నారు. ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ నెల 23 నుంచి 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం తీసుకువస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ అధికారులే రైతుల వద్దకు వెళతారని వివరించారు.