నేను రెండో సారి సీఎం కావడం వారికి ఇష్టం లేదు: సిద్ధరామయ్య
- తాను సీఎం కావడం బీజేపీ నేతలకు ఇష్టం లేదన్న సిద్ధరామయ్య
- తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
- బీజేపీ హయాంలోనే తన భార్యకు ఇంటి స్థలం కేటాయించారన్న సీఎం
తాను రెండోసారి ముఖ్యమంత్రి కావడం బీజేపీ నేతలకు ఇష్టం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. తాను సీఎం కావడాన్ని వారు ఓర్చుకోలేకపోతున్నారని చెప్పారు. అధ్వానంగా తయారైన ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ)ను దారిలోకి తీసుకొస్తానని అన్నారు. ముడాలో జరిగిన అవినీతిపై ఇద్దరు ఐఏఎస్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని చెప్పారు. బీజేపీ హయాంలోనే కాకుండా తమ ప్రభుత్వంలో కూడా తప్పులు జరిగాయని... అన్నింటినీ సరి చేస్తానని చెప్పారు. తాను సీఎం కావడం ఇష్టం లేనివారు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తన భార్య పార్వతి పేరిట ఇంటి స్థలం కేటాయించడం అక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తన భార్యకు ఇంటి స్థలాన్ని మంజూరు చేసినప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని చెప్పారు. గతంలో ముడా తప్పు చేసిందని... దానికి పరిహారంగా ఆ తర్వాత ఇంటి స్థలం ఇచ్చిందని తెలిపారు. భూమి కోల్పోయిన తాము ఇంటి స్థలాన్ని పొందడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమ ఇంటి స్థలాన్ని వెనక్కి తీసుకుని... వడ్డీతో కలిపి రూ. 62 కోట్లు చెల్లించినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.