భారత హెడ్ కోచ్‌గా గంభీర్‌ నియామకంపై పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది స్పందన

  • సానుకూలంగా మాట్లాడే స్వభావం ఉన్న గంభీర్‌ను ఇష్టపడతాన్న అఫ్రిది 
  • భారత్ కోచ్‌గా గొప్ప అవకాశం దక్కిందని వ్యాఖ్య
  • ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలన్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్
భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌‌ను నియమించడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, గతంలో పలుమార్లు మైదానంలో గంభీర్‌తో గొడవ పడిన షాహీద్ అఫ్రిది స్పందించాడు. గంభీర్‌కు చాలా గొప్ప అవకాశం దక్కిందని వ్యాఖ్యానించాడు. సానుకూలంగా మాట్లాడే స్వభావం ఉన్న గంభీర్ అంటే తనకు ఇష్టమని అన్నాడు. ఆట విషయంలో గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తాడంటూ మెచ్చుకున్నాడు. ‘స్టార్ స్పోర్ట్స్‌’తో మాట్లాడుతూ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. 

‘‘గంభీర్‌కు ఇదొక గొప్ప అవకాశమని నేను భావిస్తున్నాను. ఈ ఛాన్స్‌ను ఏ విధంగా ఉపయోగించుకుంటాడో చూడాలి. నేను గంభీర్ ఇంటర్వ్యూలు చూశాను. అతడు చాలా సానుకూలంగా మాట్లాడుతాడు. ముక్కుసూటిగా ఉంటాడు’’ అని కొనియాడాడు.

దక్షిణాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా గంభీర్‌పై ప్రశంసలు కురిపించాడు. భారత కోచ్‌గా గంభీర్‌ను నియమించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. గంభీర్ దూకుడు స్వభావానికి తాను అభిమానినని వ్యాఖ్యానించాడు. కాగా భారత ప్రధాన కోచ్‌గా ద్రావిడ్ శ్రీలంక టూర్‌తో బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సిరీస్‌లో టీ20, వన్డే సిరీస్‌లను భారత జట్టు ఆడనుంది.


More Telugu News