బాలకృష్ణను ఘనంగా సన్మానించనున్న చిత్ర పరిశ్రమ
- నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న బాలకృష్ణ
- సెప్టెంబర్ 1న బాలయ్యకు ఘన సన్మానం
- వేడుకకు రానున్న బాలీవుడ్, ఇతర సినీ రంగాల ప్రముఖులు
సినీ నటుడిగా బాలకృష్ణ ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 1974లో వచ్చిన 'తాతమ్మ కల' చిత్రంతో బాలయ్య తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఇంత సుదీర్ఘకాలం హీరోగా కొనసాగుతున్న ఏకైన నటుడు ఆయనే కావచ్చేమో. మరోవైపు, ఎమ్మెల్యేగా కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టారు. ఒకవైపు సినీరంగం, మరోవైపు రాజకీయరంగంలో సత్తా చాటుతున్న బాలయ్యను సినీపరిశ్రమ ఘనంగా సత్కరించబోతోంది.
సెప్టెంబర్ 1న సన్మాన వేడుక జరగనుంది. బాలయ్యను తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కలిశారు. సన్మాన కార్యక్రమం గురించి ఆయనతో మాట్లాడారు. బాలయ్య కూడా తన సన్మానానికి అంగీకారం తెలిపారు. సన్మాన వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని సమాచారం.