నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు
- గత అర్ధరాత్రి ఘటన
- అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని ప్రశ్నించిన పోలీసులు
- గొడ్డలి, రాయితో పోలీసులపై దాడికి యత్నం
- అప్రమత్తమై కాల్పులు జరిపిన పోలీసులు
- నిందితులను యూపీకి చెందిన అనీస్, రాజ్‌గా గుర్తింపు
హైదరాబాద్‌లో ఇటీవల వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నగర శివారులోని రింగురోడ్డుపై పారిపోతున్న పార్థీ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది.
రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నించాడు. మరొకతను రాయితో దాడిచేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికీ గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనీస్, రాజ్‌గా గుర్తించారు. వీరితో పాటు ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు కాల్పులతో భయపడి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.