చంద్రబాబు 4.0 నెల రోజుల పాలన... వంద అడుగులు

  • నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం
  • మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్దికి అడుగులు
  • కనిపించిన అనుభవం ముద్ర... ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలు
  • ప్రజల జీవితాలలో వెలుగు... ప్రభుత్వం పై నమ్మకం...  
  • సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ 
  • వివరాలు విడుదల చేసిన టీడీపీ 
నెల రోజుల పాలనలో ఏపీలో చంద్రోదయం
• అయిదేళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తున్నారు.
గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పని చేస్తున్నారు.
• నెలరోజుల పాలనలో తనదైన మార్క్‌ను చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరి చేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి... ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు.
• నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం... మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్దికి అడుగులు వేసింది.
• చంద్రబాబు అనుభవం ముద్ర కనిపించింది. ప్రభుత్వ వ్యవస్థలో మార్పు మొదలైంది. ప్రజల జీవితాలలో వెలుగు... ప్రభుత్వంపై నమ్మం కనిపిస్తోంది. వ్యవస్థలను గాడిన పెడుతున్నారు. ప్రక్షాళన మొదలు పెట్టారు.
• రాష్ట్రంలో అశాంతి లేదు... అధికార అహంకారానికి చోటు లేదు... ఆకృతాయలకు స్థానం లేదు... హంగామా, హడావుడి లేనే లేవు. సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తోంది.
• పరదాలు, బారీకేడ్లు, చెట్లు కొట్టేయడాలు లేనే లేవు. CBN 4.0లో మరింత దూకుడుగా చంద్రబాబు నాయుడు. అధికారం అంటే పదవి కాదు... బాధ్యత అని చాటిన నిజమైన ప్రజాప్రభుత్వంలా నెలరోజుల పాలన.

బాధ్యత చేపట్టిన తొలిరోజే అయిదు కీలక ఫైళ్లపై సంతకాలు
• మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. రూ.3 వేల నుండి పెన్షన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంపు, గత ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. నైపుణ్య గణనపై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు. అనంతరం కేబినెట్లోనూ ఆ ఐదు అంశాలకు ఆమోదం. 
• బాధ్యత చేపట్టిన తొలి నెలలోనే రూ.4408 కోట్ల పింఛన్ పంపణీతో సంక్షేమ పండుగకు శ్రీకారం.
• ఆగస్ట్‌లో 183 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వేగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం. 
• రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో పాస్ పుస్తకాల అందజేతకు సన్నాహాలు.
• 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిక తొలి వారంలోనే పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన.
• రెండో పర్యటనను అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు. విధ్వంసాన్ని ప్రజలకు వివరించిన చంద్రబాబు.
• అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి. ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం. రచ్చబండ మీద కూర్చొని పింఛన్ల పంపణీలో పాల్గొన్న సీఎం.
• మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్వీన్‌కు నిబంధనల పేరుతో పెన్షన్ తీసేసిన గత ప్రభుత్వం. నాడు దీనిపై ట్విట్టర్‌లో సెల్ఫీ ఛాలెంజ్ చేసిన చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తుంచుకొని జిల్లాలోనే మొదటి పెన్షన్‌ను పర్వీన్‌కు అందేలా అధికారులకు ఆదేశాలు.
• కాకినాడకు చెందిన ఆరుద్రసు సాయం అందించిన ముఖ్యమంత్రి. దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురుకు రూ.5 లక్షల సాయం అందించడంతో పాటు నెలకు రూ.15 వేల పెన్షన్ మంజూరు.
• ఎక్కడైనా తన కాన్వాయ్ వెళుతున్న సమయంలో గంటల పాటు ట్రాఫిక్ నిలిపేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచన.
• హడావుడి లేని సింపుల్ గవర్నమెంట్ ఉండాలి....పాలన ఎఫెక్టివ్‌గా ఉండాలి అనే నినాదం.
• గాడి తప్పిన శాంతిభద్రతలపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి.
• బాపట్ల జిల్లాలోని చీరాల మండలం, ఈపూరుపాలెంలో మహిళ అత్యాచారం, హత్య ఘటనపై స్పందించిన సీఎం. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు. 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. అనకాపల్లిలో బాలికను చంపిన దుర్మార్గుడు అరెస్ట్... భయంతో ఆత్మహత్య చేసుకున్న దుర్మార్గుడు. పోలీసింగ్‌లో కనిపిస్తోన్న మార్పు.
• అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో సీఎం చొరవతో రూ.50 లక్షల పరిహారం.

ఢిల్లీ పర్యటన విజయవంతం

• రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి. ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన ముఖ్యమంత్రి.
• రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుండి అందాల్సిన సాయంపై కేంద్రంతో మాట్లాడిన సీఎం.
• గత సీఎం ఢిల్లీ పర్యటనల సొంత పనుల కోసం. నేటి సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసం.
• మరోవైపు వైసీపీ విధ్వంసంపై శ్వేతపత్రాల విడుదల. గత ప్రభుత్వంలో విధ్వంసమైన 7 ముఖ్య శాఖలపై శ్వేతపత్రాల విడుదల. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగాలపై శ్వేతపత్రాల విడుదల.
• రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లోని సమస్యల పరిష్కారం కోసం తొలి అడుగు వేసిన చంద్రబాబు. 
• రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం. చంద్రబాబు ఆహ్వానంపై స్పందించి ప్రజాభవన్‌లో ఇరు ముఖ్యమంత్రుల సమావేశం.

ఉచిత ఇసుక
• ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించిన సీఎం. గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో కుదేలైన నిర్మాణ రంగం. ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగానికి ఊతమిచ్చిన సీఎం. కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే వర్తించేలా ఇసుక పంపిణీ.

పెట్టుబడులపై ముందడుగు
• ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా అడుగులు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పలువురు పారిశ్రామికవేత్తల భేటీ. 
• బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎంతో సంస్థ ప్రతినిధుల భేటీ. రూ.60 వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు
ప్రతిపాదనలు. విన్ ఫాస్ట్ అనే ఆటోమొబైల్ సంస్థతో చర్చలు. పెట్టుబడుల కోసం ప్రయత్నాలు.
• పారిశ్రామికవేత్తలలో నమ్మకం కలిగించేలా చర్యలు. ఇప్పటికే మొదలైన స్పందన.
• ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి. 2026కు ఎయిర్ పోర్ట్ పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు.
• వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్, పలు అంశలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్షలు. మంత్రులను ఉరుకులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి.

పార్టీ క్యాడర్‌కు భరోసా
• పార్టీ కోసం పోరాటం చేసిన క్యాడర్‌కు భరోసా. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు.
• పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపును ఇచ్చేందుకు విస్తృత కసరత్తు. నామినేటెడ్ పదవుల పైన కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు.
• సామాజిక న్యాయానికి పెద్దపీట. బీసీలకు పార్టీలో గౌరవం. రాష్ట్ర అధ్యక్షుడిగా, స్పీకర్‌గా బీసీ నేతలు. 
• మొదటి మూడు నెలల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్న అధిష్ఠానం. 
• పార్టీ కేంద్ర కార్యాలయం, గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.
• అక్రమంగా కడుతున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కూటమి ప్రభుత్వం.
• జగన్‌తో అంటకాగిన అధికారులను దూరంగా పెడుతున్న ముఖ్యమంత్రి. మద్యం, ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో చర్యలకు శ్రీకారం. దర్యాఫ్తు మొదలు. గతానికి భిన్నంగా వేగవంతమైన నిర్ణయాలతో దూసుకెళ్తున్న సీఎం.


More Telugu News