అభిప్రాయాలు తెలుసుకోవడానికే రైతు భరోసాపై సదస్సులు: భట్టివిక్రమార్క
- ఉట్నూరు రైతు భరోసా వర్క్ షాప్‌లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి
- రైతు భరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు వెల్లడి
- అన్నదాతల అభిప్రాయాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న భట్టివిక్రమార్క
రైతు భరోసాపై అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసా వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం విధివిధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదాతల అభిప్రాయాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రైతు భరోసా వర్క్ షాప్ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తున్నట్లు చెప్పారు. చిన్న రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
ప్రజలతో చర్చించి పథకాలు అమలు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.