రాహుల్ గాంధీ చెంపలు వాయించాలన్న బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
- పార్లమెంటులో రాహుల్ శివుడి ఫొటో ప్రదర్శించడంపై భరత్‌శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు
- హిందువులను హింసావాదులుగా ముద్ర వేస్తున్నారని మండిపాటు
- చెంపదెబ్బలకు రాహుల్ అర్హుడేనని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేత ఫిర్యాదుపై మంగళూరులో కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కర్ణాటకలోని మంగళూరు నార్త్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వై.భరత్‌శెట్టిపై కేసు నమోదైంది. మంగళూరు సిటీ కార్పొరేషన్ సభ్యుడు అనిల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పార్లమెంటులో శివుడి ఫొటోను ప్రదర్శించిన రాహుల్‌గాంధీ చెంపలు పగలగొట్టాలంటూ భరత్‌శెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివుడి మూడో కన్నును రాహుల్ విస్మరిస్తున్నారని, అది ఎవరినైనా బూడిదగా మార్చేస్తుందని పేర్కొన్నారు. హిందువులను హింసావాదులుగా ముద్రవేస్తున్న రాహుల్ చెంపదెబ్బకు అర్హుడేనంటూ వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు.
భరత్ వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు. భరత్‌శెట్టికి నిజంగానే అంత ధైర్యం ఉంటే కనీసం తమ కార్యకర్తపైన అయినా చెయ్యెత్తాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బి.రామనాథరాయ్ సవాలు విసిరారు. కాగా, అనిల్ కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మంగళూరు డీసీపీ సిద్ధార్థ్ గోయల్ తెలిపారు.