సమీపిస్తున్న ఐటీఆర్ ఫైలింగ్ గడువు.. ఇంట్లో కూర్చొని ఈజీగా ఇలా పూర్తి చేయవచ్చు!
ఆదాయ పన్ను రిటర్న్-2024 దాఖలకు గడువు సమీపిస్తోంది. వేతన జీవులైనా లేదా వ్యాపార యజమానులైనా జులై 31 లోగా రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గడువు సమీపించే వరకు వేచిచూడడం మంచిది కాదని, గడువు తేదీ కంటే ముందుగానే ఫైల్ చేయడం ద్వారా లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని చెల్లింపుదారులకు నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే చార్టర్డ్ అకౌంటెంట్‌ల సహాయం తీసుకోవచ్చని, లేదంటే సొంతంగా ఇంట్లో కూర్చొని కూడా ఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చునని సలహా ఇస్తున్నారు. ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్ ద్వారా రిటర్న్ చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో సొంతంగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలనుకునేవారు ఈ స్టెప్స్ పాటించి పూర్తి చేయవచ్చునని చెబుతున్నారు.
ఐటీఆర్ ఫైలింగ్‌కు కావాల్సిన పత్రాలు..
ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయాలనుకునేవారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఫామ్-16, ఫారం 16ఏ, ఫారం 26ఏఎస్, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్స్, పన్ను ఆదా పెట్టుబడులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ పత్రాలు తప్పనిసరిగా అవసరం.
ఆన్‌లైన్‌లో దశల వారీగా ఇలా పూర్తి చేయాలి..
ఎవరెవరు చేయాలి?
కాగా ఆదాయ పన్ను చాప్టర్ 6-ఏలోని 80సీ, 80సీసీసీ, 80సీసీడీ, 80డీ, 80ఈ, 80జీ, 80జీజీఏ, 80టీటీఏ/80టీటీబీ వంటి వివిధ సెక్షన్‌ల కింద మినహాయింపులు పొందాక కూడా పరిమితికి మించి ఆదాయం పొందుతున్నవారు ఆదాయ పన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు సైతం ఇక్కడి లాభదాయకమైన ఆస్తులపై వచ్చే ఆదాయానికి సంబంధించి తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

- ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.
- ఒకవేళ రిజిస్టర్డ్ వినియోగదారుడైతే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ కావొచ్చు. ఒకవేళ కొత్త వినియోగదారులైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- పోర్టల్‌లోకి లాగన్ అయ్యాక 'ఈ-ఫైల్' మెనూలోకి వెళ్లి 'ఆదాయ పన్ను రిటర్న్స్'ని సెలక్ట్ చేసుకోవాలి.
- ఆదాయాన్ని బట్టి తగిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఫామ్-16 ఉంటే ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఎంచుకోవాలి.
- అసెస్‌మెంట్ ఇయర్ దగ్గర 2024-25ను ఎంచుకోవాలి.
- వ్యక్తిగత సమాచారం, ఆదాయానికి సంబంధించిన వివరాలు, మినహాయింపులు, చెల్లించిన పన్ను వంటి వివరాలు అన్నింటినీ నింపాలి.
- అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత పూర్తిగా చెక్ చేసుకొని తప్పులను సరిదిద్దుకోవాలి. వివరాలన్నింటినీ ధ్రువీకరించుకోవాలి.
- వివరాలు అన్నింటినీ నిర్ధారించుకున్నాక ‘సబ్మిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఫామ్ సమర్పించిన తర్వాత ఆధార్ ఓటీపీ లేదా అందుబాటులో ఉన్న ఆప్షన్లను ఉపయోగించి రిటర్న్స్‌ను ధ్రువీకరించుకోవాలి.
- ఆ తర్వాత అప్‌లోడ్‌పై క్లిక్ చేయాలి.