డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ మద్దతుదారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: జగన్
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై తాము నిష్పాక్షింగా వార్త రాశామన్న డెక్కన్ క్రానికల్
- కానీ టీడీపీ గూండాలు తమ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపణ
- డెక్కన్ క్రానికల్ కు సంఘీభావం ప్రకటించిన జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము నిష్పక్షపాత ధోరణిలో వార్త ప్రచురించామని, కానీ టీడీపీ గూండాలు తమ కార్యాలయంపై దాడి చేశారని డెక్కన్ క్రానికల్ పత్రిక ఆరోపించడం తెలిసిందే.
దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు.
కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీలో ప్రజాస్వామ్యం పదేపదే ఉల్లంఘనలకు గురవుతోందని... ఏపీ ముఖ్యమంత్రి దీనికి కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు.