మూడో టీ20లో టీమిండియాదే విజయం... సిరీస్ లో ముందంజ

  • నేడు టీమిండియా, జింబాబ్వే మధ్య మూడో టీ20
  • 23 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి
  • మొదట 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసిన టీమిండియా
  • లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసిన జింబాబ్వే
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వేను టీమిండియా బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. 

ఛేజింగ్ లో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో డియాన్ మైర్స్ 65 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 49 బంతులు ఎదుర్కొన్న మైర్స్ 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. మైర్స్ కు వికెట్ కీపర్ క్లైవ్ మడాండే నుంచి చక్కని సహకారం లభించింది. మడాండే 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేశాడు. 

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (13) ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జులై 13న జరగనుంది.


More Telugu News