రేపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్!
- క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన 'ప్లాట్'
- ప్రధానమైన పాత్రలలో వికాస్ - గాయత్రి గుప్తా
- ఎమ్మిగనూరు నేపథ్యంలో నడిచే కథ
- ఈ నెల 11 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సెంటర్లు పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఈ తరహా జోనర్ కి చెందిన కంటెంట్ పట్ల ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అందువలన అలాంటి కాన్సెప్ట్ తో కూడిన కంటెంట్ ను అందించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి ఒక సినిమా రెడీ అవుతోంది.
సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఆ సినిమా పేరే 'ప్లాట్'. వికాస్ - గాయత్రి గుప్తా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను తరుణ్ విఘ్నేశ్వర్ నిర్మించగా, భాను భవతారక దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది నవంబర్లో థియేటర్లకి ఈ సినిమా వచ్చింది .. కానీ పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వలన ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది.
అలాంటి ఈ సినిమాను ఈ నెల 11వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. కర్నూల్ లోని 'ఎమ్మిగనూరు' నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. రాహుల్ - దీపు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే వారి జీతం ఒక హత్యతో ముడిపడి ఉంటుంది. ఆ హత్యకి సంబంధించి ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. అతను ఎవరు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.