బీపీసీఎల్ ప్రతినిధులతో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతినిధి బృందం మధ్య సమావేశం ముగిసింది. నేడు రాష్ట్రానికి వచ్చిన బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, ఆ సంస్థ ప్రతినిధులు తొలుత విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అనంతరం అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్రో రిఫైనరీ (చమురు శుద్ధి కర్మాగారం) ఏర్పాటుపై చర్చించారు. దాదాపు రూ.60 వేల కోట్లతో ఏపీలో రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ ఆసక్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురిని కలిశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేసే ఆలోచనను ఆయన ముందుంచారు. ఈ నేపథ్యంలోనే, బీపీసీఎల్ ప్రతనిధులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయినట్టు తెలుస్తోంది.


More Telugu News