రైలు పట్టాల మధ్య చేపలు.. వీడియో ఇదిగో!
- కుండపోత వర్షాలకు ముంబైలో మునిగిన లోతట్టు ప్రాంతాలు
- పలు రైల్వే స్టేషన్లను ముంచెత్తిన వరద నీరు
- వరద నీటితో పాటు కొట్టుకొచ్చిన చేపలు
కుండపోత వర్షాలకు ముంబై అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. అండర్ పాస్ లు, రైల్వే స్టేషన్లు, పట్టాలు నీట మునిగాయి. రైళ్లు, బస్సులు బంద్ కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలు నీట మునగడం, ఆ నీటిలో చేపలు తిరగడం కనిపించింది.
సిటీలోని ఓ రైల్వే స్టేషన్ లో పట్టాల మధ్య చేపలు తిరుగుతుండడం చూసి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నాలుగైదు చేపలు చెరువులోనో నదిలోనో ఉన్నట్లు ఎంచక్కా అటూఇటూ పరుగులు తీయడం ఈ వీడియోలో చూడొచ్చు. పట్టాలపైకి రైళ్లు వచ్చిపోవడం కామన్ కానీ ఇలా చేపలు తిరగడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.