‘కల్కి’ని తెలుగు ప్రేక్షకులే బాగా ఎంజాయ్ చేస్తున్నారు: అమితాబ్
- హైదరాబాద్ లో ప్రేక్షకులతో కలిసి కల్కి సినిమా చూడాలని ఉందని వ్యాఖ్య
- సినిమాలో దీపికా పదుకొణే పాత్ర అద్భుతమని మెచ్చుకున్న బిగ్ బి
- డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ.. ప్రోమో విడుదల
కల్కి సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే హైదరాబాద్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని కల్కి చూడాలని అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఈమేరకు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను అమితాబ్ వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
కల్కి సినిమాకు సంబంధించి తనకు వస్తున్న ప్రశంసలు నిజానికి తన నటనకు కావని, ఆ పాత్రకు దక్కుతాయని అమితాబ్ చెప్పారు. ఈ సినిమాలో తనకు బాగా నచ్చిన పాత్ర దీపికా పదుకొణేదని వివరించారు. ఆమె నిప్పుల్లో నడుచుకుంటూ వచ్చే సీన్ సినిమాకే హైలైట్ అన్నారు. ఈ ఐడియా వచ్చినందుకు మిమ్మల్ని ప్రశంసించాలని నాగ్ అశ్విన్ తో అన్నారు. ఈ విషయంపై తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
కాగా, నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా కాన్సెప్ట్ ‘మహాభారతంలో చివరి ఘట్టం’ అని స్పష్టతనిచ్చారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందని చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలావుంచితే, కల్కి సినిమా ఆగస్టు 15 నుంచి ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.