ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐగా మొరాకో ‘భామ’ కెన్జా

  • 1500 మంది ఏఐ భామలను వెనక్కి నెట్టి విజేతగా నిలిచిన కెన్జాలేలి
  • 20 వేల డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్న సుందరి
  • కెన్జాను సృష్టించిన ఫినిక్స్ ఏఐ సీఈవో మెరియం బెసా
  • టాప్-10లోకి దూసుకొచ్చి ఆశలు రేపిన భారత ఏఐ సుందరి జారా శతావరి
ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ఏఐ అందాల పోటీల్లో మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్ కెన్జాలే విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. కృత్రిమ మేథస్సు చార్ట్స్‌లో టాప్‌లో నిలిచిన కెన్జా 1500 మంది మోడళ్లను (కంప్యూటర్ ద్వారా రూపొందించిన మోడళ్లు)ను వెనక్కి నెట్టి విజేతగా అవతరించింది. వరల్డ్ మిస్ ఏఐగా నిలిచిన కెన్జాకు 20 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కెన్జా అనంతరం మాట్లాడుతూ మనుషుల్లా తనకు భావోద్వేగాలు లేనప్పటికీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. 

కెన్జాకు 2 లక్షలమంది ఫాలోవర్లు
మిస్ ఏఐ కెన్జాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫుడ్, కల్చర్, ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్ వంటివాటిపై వీడియోలు చేస్తుంది. మొరాకో వారసత్వం, సంస్కృతి, సాంకేతికతకు ప్రతిబింబంగా నిలిచే ఈ వర్చువల్ కేరెక్టర్ తన ఫాలోవర్లకు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. అలాగే ఏడు వేర్వేరు భాషల్లో మాట్లాడగలదు. 

ఏఐ అనేది మానవ సామర్థ్యాలను నిరూపించేందుకు రూపొందించిన టూల్ మాత్రమేనని, అంతేతప్ప మానవులను అది భర్తీ చేయలేదని కెన్జా స్పష్టం చేసింది. మొరాకో తరపున ఈ అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఫినిక్స్ ఏఐ సీఈవో మెరియం బెసా ఈ ఏఐ సుందరిని సృష్టించారు. కాగా, భారత్‌కు చెందిన ఏఐ సుందరాంగి జారా శతావరి ఈ పోటీల్లో టాప్-10కి వచ్చి ఆశలు రేపినా  ఆ తర్వాత ముందడుగు వేయలేకపోయింది.


More Telugu News