అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికుల ఆర్తనాదాలు... ఇద్దరు చిన్నారుల మృతి.. వీడియో ఇదిగో

అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికుల ఆర్తనాదాలు... ఇద్దరు చిన్నారుల మృతి.. వీడియో ఇదిగో
  • మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన
  • ఓ ప్రయాణికుడి కెమెరా ఆన్‌లో ఉండటంతో రికార్డ్
  • ట్రక్కును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ప్రమాదం
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బస్సులోని ప్రయాణికులు భయంతో ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఉంది.

బస్సులోని ఓ ప్రయాణికుడి కెమెరా ఆన్‌లో ఉండటంతో ఇది రికార్డ్ అయింది. వీడియో ప్రకారం ఈ బస్సు చాలా వేగంగా వెళుతోంది. ముందు వెళుతున్న లారీని, ఇతర వాహనాలను ఇది ఓవర్ టేక్ చేసింది. ఆ తర్వాత వెళ్లి లోయలోని గోడను బలంగా తాకి లోయలోకి పడిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో ఆర్తనాదాలు చేశారు.

గుజరాత్‌లోని డాంగ్ జిల్లా సాత్పూరా ఘాట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా సూరత్‌కు చెందిన వారు. బస్సు డ్రైవర్ ఓ ట్రక్కును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా బస్సు కంట్రోల్ తప్పింది. దీంతో ప్రమాదం జరిగింది.


More Telugu News