ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా
- వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడిన రామాచార్యులు
- రాజీనామా లేఖను స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పంపిన రామాచార్యులు
- అసెంబ్లీ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై అభియోగాలు
వైసీపీకి అనుకూల అధికారిగా ముద్రపడిన ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి తన రాజీనామా లేఖను పంపారు. శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై అభియోగాలు ఉన్నాయి.
ఇటీవల ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించే సమయంలో... అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ చానళ్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైలు సిద్ధం చేయడంలోనూ రామాచార్యులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది.
అయ్యన్న స్పీకర్ హోదాలో తొలి సంతకం చేసే ఫైలు విషయంలో రామాచార్యులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని, ఆ మూడు చానళ్లపై నిషేధం ఎత్తివేత అంశాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా ఆమోదం
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. హేమంద్రారెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది.