సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకిన స్టాక్ మార్కెట్ సూచీలు
- ఫారెన్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు
- రోజంతా కళకళలాడిన స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఇవాళ్టి ట్రేడింగ్ లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో... సెన్సెక్స్ 80,397.17... నిఫ్టీ 24,433.20 వద్ద సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 391.26 పాయింట్ల వృద్ధితో 80,351.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 112.65 పాయింట్లు లాభపడి 24,433.20 వద్ద స్థిరపడింది.
ఫారెన్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు నేటి ట్రేడింగ్ సరళిని నిర్దేశించాయి. మరోవైపు ప్రపంచ మార్కెట్ల నుంచి వీచిన సానుకూల పవనాలు కూడా భారత స్టాక్ మార్కెట్ సూచీలను రోజంతా కళకళలాడించాయి.
మారుతి సుజుకి, దివీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, హిండాల్కో షేర్లు లాభపడగా... రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.