సీఎం చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం... రుణ ప్రణాళిక విడుదల
- అమరావతిలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన... పలు అంశాలపై చర్చించిన ఎస్ఎల్ బీసీ
- పలు అంశాలపై సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్ బీసీ) జరిగింది. ఈ సమావేశంలో... 2024-25 సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయించారు.
వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యవసాయ రంగానికి గతం కంటే 14 శాతం అధిక రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయంలో యాంత్రీకరణ, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు రూ.32,600 కోట్లను కేటాయించారు. ఎంఎస్ఎంఈలకు ఈ ఏడాది 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వనున్నారు. గృహనిర్మాణ రంగంలో రూ.11,500 కోట్ల రుణాలు, సంప్రదాయేతర ఇంధన రంగంలో రూ.8 వేల కోట్లు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలో పేర్కొన్నారు.
సాగు ఖర్చుల తగ్గింపు, కౌలు రైతులకు రుణాలు, పంటల బీమా, పీ-4 ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.