మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం: రేవంత్ రెడ్డి
- ఉదయం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సిరాజ్
- హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం గుర్తించాలని ఆదేశాలు
- టీ ప్రపంచకప్ సాధించిన టీమ్‌లో సిరాజ్
భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని సిరాజ్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా క్రికెటర్‌కు ఇంటి స్థలంపై ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.