ఆ 14 ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వెనక్కి తీసుకుంటున్నాం: సుప్రీంకోర్టుకు తెలిపిన పతంజలి
- వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా 14 ఉత్పత్తులపై ప్రకటనలు
- ఇప్పటికే ఆయా ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పతంజలి గ్రూప్
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ 14 రకాల ఉత్పత్తులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కొంటోంది. తాజాగా ఈ కేసులో పతంజలి సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.
మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్ రద్దు అయిన ఆ 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశామని కోర్టుకు విన్నవించింది. అంతేకాకుండా, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఆ ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభించామని, ఆ మేరకు తమ ఫ్రాంచైజీ స్టోర్లకు సమాచారం అందించామని వివరించింది. ముఖ్యంగా, ఆయా ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చామని పతంజలి సంస్థ తమ అఫిడవిట్ లో పేర్కొంది.
పతంజలి సంస్థ 14 రకాల ఉత్పత్తుల విషయంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చినట్టు తేలడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే ఆయా ఉత్పత్తుల తయారీ లైసెన్స్ లు రద్దు చేసింది.