యూపీలో భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన 'ఆవాస్ యోజన' డబ్బులు!
- యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలోనే 11 కేసుల నమోదు
- మొదటి విడతగా రూ.40 వేలు మంజూరు చేసిన ప్రభుత్వం
- ఇదే సమయంలో ప్రియులతో వెళ్లిన వివాహితలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఆర్థిక సాయం అందుకున్న తర్వాత పలువురు మహిళలు... తమ భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోతున్నారట. ఇందుకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో పదికి పైగా ఘటనలు చోటు వెలుగు చూశాయి. పేదల సంక్షేమంలో భాగంగా పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద మొదటి విడత సాయం పొందిన యూపీకి చెందిన వివాహితలు... ఆ తర్వాత నచ్చినవారితో పారిపోయినట్లు వెల్లడైంది.
యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఇటీవల 2,350 మందికి ఈ పథకం కింద నగదు విడుదలైంది. తొలి విడతగా రూ.40 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యింది. అయితే, ఇదే సమయంలో తమ భార్యలు వేరేవారితో వెళ్లిపోయారని పోలీసులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ ఒక్క జిల్లాలోనే ఇలాంటివి 11 కేసులు నమోదయ్యాయి. దీంతో రెండో విడత నగదును నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా అధికారులు తెలిపారు.