ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం
- రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ
- ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చ
- ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా చర్చించే అవకాశం
ఏపీలో కూటమి ప్రభుత్వ క్యాబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 16న జరిగే క్యాబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జులై 31 వరకు ఉంటుంది. దాంతో, ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.