చట్నీ గిన్నెలో చిట్టెలుక.. జేఎన్‌టీయూ క్యాంటీన్‌లో షాకింగ్ ఘటన!
- సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఉన్న జేఎన్‌టీయూ కాలేజీ క్యాంటీన్‌లో ఘటన
- చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో పడ్డ ఎలుక
- చట్నీలో ఎలుకను గమనించి వీడియో తీసి నెట్టింట పెట్టిన విద్యార్థులు
- చట్నీలో ఎలుక పడలేదంటూ కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ వివరణ
సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఉన్న జేఎన్‌టీయూ కాలేజీ క్యాంటీన్‌లో చిట్టెలుక కలకలం సృష్టిచింది. ఇంజినీరింగ్ హాస్టల్‌లో ఉన్న క్యాంటీన్‌లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయితే చట్నీలో ఎలుకను గమనించిన విద్యార్థులు క్యాంటిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వీడియో తీసి నెట్టింట పోస్టుచేశారు.
కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ నరసింహ స్పందించారు. చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని తెలిపారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు.
కాగా, గత నెల 24న కూడా కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనమివ్వడంతో ఆందోళనకు దిగారు. తాము రోజూ తినే ఆహారంలో పురుగులు వస్తుంటే వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీసీ చాంబర్ ముందు ఆందోళనకు దిగారు.