బ్యాంకర్లకు ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించిన సీఎం చంద్రబాబు
- ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
- ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలన్న చంద్రబాబు
- ఈ సమావేశానికి హాజరైన మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు.
డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని... రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్లతో ప్రముఖ పాత్ర అని కొనియాడారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు.