భారతీయుడు-2 చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి
- డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు
- సినీ ప్రముఖులు కూడా పాలుపంచుకోవాలన్న సీఎం రేవంత్
- ఇప్పటికే వీడియో రూపొందించి ఇచ్చిన చిరంజీవి
- తాజాగా భారతీయుడు-2 చిత్రబృందం నుంచి వీడియో సందేశం
కొత్త సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచాలని తమ వద్దకు వచ్చే సినీ ప్రముఖులు విధిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం కోసం ఓ వీడియో రూపొందించి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్వచ్ఛందంగా డ్రగ్స్ వ్యతిరేక వీడియో రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి అందించారు.
తాజాగా, హైదరాబాద్ లో ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉన్న భారతీయుడు-2 చిత్రబృందం కూడా డ్రగ్స్ పై అవగాహన వీడియో రూపొందించింది. కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నటులు సిద్ధార్థ్, సముద్రఖని ఈ వీడియోలో సందేశం అందించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
"భారతీయుడు-2 చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం... ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా... కమల్ హాసన్, శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని కలిసి ఈ అవగాహన వీడియో రూపొందించడం హర్షణీయం" అని పేర్కొన్నారు. ఈ మేరకు భారతీయుడు-2 చిత్రబృందం రూపొందించిన వీడియోను పంచుకున్నారు.