బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో ప్రోటోకాల్ వివాదం.. అలిగిన మంత్రి పొన్నం
- అట్టహాసంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు
- ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ఆగ్రహం
- ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట
- దాంతో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన వైనం
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దాంతో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌పై అసహనం వ్యక్తం చేశారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు.