త్రిష ప్రధాన పాత్రగా 'బృంద' .. క్రైమ్ థ్రిల్లర్ సీరీస్ నుంచి టీజర్ రిలీజ్!
- సోనీ లివ్ నుంచి వస్తున్న 'బృంద'
- టైటిల్ రోల్ పోషించిన త్రిష
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఆగస్టు 2వ తేదీ నుంచి 7 భాషల్లో స్ట్రీమింగ్
- కీలకమైన పాత్రలో కనిపించనున్న ఆమని
త్రిష ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇంత బిజీలోను ఆమె వెబ్ సిరీస్ లపై తన ఫోకస్ తగ్గించలేదు. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన 'బృంద' ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. 'సోనీ లివ్'లో ఆగస్టు 2న ఈ వెబ్‌సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో పలకరించనుంది.
ఈ సిరీస్ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్ వంగాల మాట్లాడుతూ ‘సోనీ లివ్’ ద్వారా పాన్ ఇండియా ఆడియన్స్‌ని 'బృంద' సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. 'బృంద' ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. శక్తిమంతమైన ఫీమేల్ లీడ్ నెరేటివ్ స్టోరీతో ఈ సిరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుంది" అని అన్నారు.
సూర్య మనోజ్ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కి హైలైట్ కానుంది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు. ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఉత్కంఠ రేపే ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని చూడటానికి ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే.