మోదీ స్వాగత కార్యక్రమంలో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రష్యన్ చిన్నారి నృత్యం.. వీడియో వైరల్!
- రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
- మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యన్ మహిళల భాంగ్రా నృత్యం
- ఈ క్రమంలో ఓ రష్యన్ చిన్నారి భారతీయ వస్త్రధారణలో డ్యాన్స్
- ఢోల్ దరువులకు అనుగుణంగా పాప చేసిన నృత్యం వీడియో నెట్టింట వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఆ దేశానికి చేరుకున్న భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యన్ మహిళలు భారతీయ వేషధారణలో భాంగ్రా నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. వాటి తాలూకు ఫొటోలు, వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలో ఓ రష్యన్ చిన్నారి సంప్రదాయ భారతీయ వస్త్రాధారణలో ఢోల్ దరువులకు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పాప డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసింది.
వీడియోలో చిన్నారి పసుపు, ఎరుపు రంగు ఘాగ్రా చోలీని ధరించి, తలపై దుపట్టాతో కనిపించింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌లో మోగుతున్న ధోల్ లయకు అనుగుణంగా భాంగ్రా నృత్యం చేయడం వీడియోలో ఉంది. ఆ పాప ఎంతో క్యూట్‌గా డ్యాన్స్ చేయడం మనం వీడియోలో చూడొచ్చు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.
పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే ఈ అందమైన వీడియోకు దాదాపు 1.20 లక్షల వ్యూస్ దక్కాయి. అలాగే 6,400 కంటే ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇండియన్ డ్యాన్స్ రియాలిటీ షోను ప్రస్తావిస్తూ "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్" అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు "బ్యూటిఫుల్" అని వ్యాఖ్యానించారు. ఇంకోకరు డ్యాన్స్ చాలా అందంగా ఉందంటూ రాసుకొచ్చారు.
ఇక ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి మాస్కోలో జరిగే 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. కాగా, ఈ పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్‌తో ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై చర్చల నుండి ఉక్రెయిన్ వివాదం వరకు అనేక అంశాలను మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.