లండన్ ఇస్కాన్ ఆలయంలో అనుష్క, కోహ్లి!
- నెట్టింట వైరల్ గా మారిన ఏడాది క్రితం వీడియో
- ప్రస్తుతం ఆ జంట లండన్ లోనే ఉండటంతో ఇప్పటిది అనుకొని పొరబడ్డ నెటిజన్లు
- అభిమాన క్రికెటర్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు
టీమిండియా స్టార్ ప్లేయర్ ‘కింగ్’ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, పిల్లలతో కలిసి ప్రస్తుతం లండన్ లో సరదాగా సమయం గడుపుతున్నాడు. అయితే అక్కడి ఇస్కాన్ ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీసమేతంగా కోహ్లీ హాజరైనట్లు చూపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్ క్లబ్ పేరిట ‘ఎక్స్’లో ఓ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘లండన్ లో నిన్న జరిగిన కృష్ణ దాస్ కీర్తన కార్యక్రమానికి విరాట్, అనుష్క హాజరయ్యారు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. కానీ అది పాత వీడియోగా తేలింది. ఎందుకంటే.. గతేడాది జూన్ లో సైతం అదే వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.
అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లంతా అది ఇప్పటిదనుకొని పరస్పరం షేర్ చేసుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ ను మెచ్చుకుంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ‘అంబానీ ఇంట పెళ్లి వేడుకలో సెలబ్రిటీలంతా బిజీగా ఉంటే నా ఆరాధ్య క్రికెటర్ మాత్రం భార్యతో కలిసి లండన్ ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించాడు’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరేమో ‘కీర్తన, కెప్టెన్, కాస్మోపాలిటన్’ అంటూ రాసుకొచ్చారు. ‘నీ రోజును ఆస్వాదించు’అంటూ మరొకరు స్పందించారు.
ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశం చేరుకోగానే టీమిండియా తొలుత ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం ముంబైలో జరిగిన సంబరాల్లో పాల్గొంది. ఆ తర్వాత కోహ్లీ అక్కడి నుంచి లండన్ లో ఉన్న తన భార్య, పిల్లలతో కలిసి గెలుపు సంబరాలు చేసుకొనేందుకు వెళ్లాడు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా నిలిచిన ఒకే ఒక్క ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే.