అల్పపీడనంగా ఉపరితల ఆవర్తనం.. కోస్తాకు భారీ వర్షసూచన
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ద్రోణి
- వాటి ప్రభావంతో చురుగ్గా మారిన రుతుపవనాలు
- వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు, పడమరగా ద్రోణి వ్యాపించింది. దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి రాయపూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల్లో మరింత కదలిక వచ్చింది. నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.