మార్కెట్ కంటే తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు అందిస్తాం: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తాలూకు వివరాలను నాదెండ్ల వెల్లడించారు. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలు తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.181, బియ్యం రూ.52.40, స్డీమ్డ్ రైస్ రూ.55.85 ఉన్నాయని... అయితే తాము రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తగ్గింపు ధరలకే నిత్యావసరాలు అందిస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.

గురువారం నుంచి రైతు బజార్ల ద్వారా కందిపప్పు కిలో రూ.160, బియ్యం రూ.48, స్టీమ్డ్ రైస్ రూ.49కే అందిస్తామని వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు.


More Telugu News