డ్రగ్ టెస్ట్ రిపోర్టు కాపీతో ‘మా’కు నటి హేమ లేఖ
- రేవ్ పార్టీ విషయంలో తనపై దుష్ప్రచారం జరిగిందని వివరణ
- తన సభ్యత్వం పునరుద్ధరించాలని కోరిన నటి
- మా ప్రెసిడెంట్ విష్ణును కలిసి లేఖ అందజేత
బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంతో చిక్కులపాలైన నటి హేమ తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు సంచలన లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో ఈ లేఖను సోమవారం స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. రేవ్ పార్టీ విషయంలో తనపై అసత్య ప్రచారం జరిగిందని, మీడియా కథనాల ఆధారంగా తన సభ్యత్వంపై వేటువేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తన వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని, అందులో నెగిటివ్ వచ్చిందని హేమ పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ ను కూడా మంచు విష్ణుకు అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు.
ఆమధ్య బెంగళూరులోని ఓ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో తెలుగు నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించగా.. తనకేం సంబంధంలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని నటి హేమ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో పైనా బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కస్టడీలో ఉన్న సమయంలో పక్కకు వెళ్లి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు. హేమను అరెస్టు చేసి జైలుకు పంపగా.. ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ ఆరోపణలతో పాటు హేమ జైలుకు వెళ్లడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆమె సభ్యత్వాన్ని తొలగించారు.
'మా'లో తన సభ్యత్వం తొలగింపును నటి హేమ తప్పుబట్టారు. 'మా' బైలాస్ ప్రకారం తనకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలని, తన వివరణ కోరాలని చెప్పారు. నోటీసులకు తాను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోతే అప్పుడు సభ్యత్వం రద్దు చేయాలని వివరించారు. కానీ తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అసోసియేషన్ నుంచి తీసేశారని గుర్తుచేశారు. కాగా, హేమ లేఖను అందుకున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఆ లేఖను మా అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, కమిటీ లో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.
హేమ రాసిన లేఖ..
డ్రగ్ టెస్ట్ రిపోర్ట్..